రాష్ట్రంలో మొదటిసారి విశాఖలోనే: సీపీ

రాష్ట్రంలో మొదటిసారి విశాఖలోనే: సీపీ

విశాఖలో లోన్ యాప్ మోసాలతో 295 మంది వరకు బాధితులను గుర్తించినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు.సైబర్ క్రైమ్ ఇన్‌స్టంట్ లోన్ యాప్ కేసులో గుర్తించిన క్రిప్టో కరెన్సీని ఇండియా కరెన్సీలోకి మార్చి వందమంది బాధితులకు రూ.50లక్షలను మంగళవారం అందించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి సహాయం విశాఖలో చేసినట్లు తెలిపారు.