గ్యాస్ కష్టాలు....రోడ్డున పడ్డ కుటుంబాలు

గ్యాస్ కష్టాలు....రోడ్డున పడ్డ కుటుంబాలు

KNR: అంతర్జాతీయ యుద్ధ మేఘాలు నగరంలోని సామాన్యుల ఉపాధిని దెబ్బతీశాయి. కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా కరీంనగర్ కమాన్ వద్దనున్న 'శ్రీ లక్ష్మీ టిఫిన్ సెంటర్' సోమవారం నుంచి మూతపడింది. గ్యాస్ సరఫరా లేక దుకాణం నడపలేకపోతున్నామని యజమాని ఆవేదనతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో యజమానితో పాటు అక్కడ పనిచేసే కార్మికులు వీధిన పడటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.