సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీల సమీక్ష
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీలు సంకీర్త్, సుధీర్ రామ్‌నాథ్ కేకన్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, పార్కింగ్, సభా ప్రాంగణంలోని బారికేడ్లు, స్టేజ్ పనులను సమగ్రంగా సమీక్షించారు. సీఎం పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.