VIDEO: 'ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి'

AKP: గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆధార్ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని నాతవరం ఎంపీడీవో ఉషశ్రీ సూచించారు. నాతవరం మండలం చెర్లోపాలెం పంచాయతీలో గురువారం ప్రత్యేక ఆధార్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సిబ్బంది బయోమెట్రిక్ అప్డేట్, పేర్లు, ఇంటి చిరునామా తదితర మార్పులు, మొబైల్ నెంబర్లు నమోదు, చిన్న పిల్లలకు ఆధార్ నమోదు వంటి సేవలను అందింస్తోంది.