VIDEO: అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
NLR: కావలి ముసునూరులోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆదివారం MLA కావ్య కృష్ణారెడ్డి స్వామివారి దర్శనం చేసుకున్నారు. కావలి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ఆయన ప్రార్థించారు. అర్చకులు ఎమ్మెల్యేని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో మమేకమై వారి అవసరాలు తెలుసుకున్నారు.