లారీ ఢీకొని వ్యక్తి మృతి

లారీ ఢీకొని వ్యక్తి మృతి

SKLM: ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై వెళ్తున్న బైక్‌ను లారీ ఆదివారం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం గంజాం అల్లాడి పూర్ గ్రామానికి చెందిన దుర్యోధన రెడ్డి (30) అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంపై ఉన్న మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.