యువకుడి కళ్ళు దానం చేసిన తల్లిదండ్రులు

RR: కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన మారమోని శివ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి తల్లిదండ్రులు మంజుల, రవి తమ కుమారుడి కళ్లను దానం చేసి మానవత్వం చాటుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి కళ్లను దానం చేయగా, వాటిని మరో ఇద్దరికి అమర్చనున్నారు. ఈ గొప్ప కార్యానికి ఒడిగట్టినందుకు శివ తల్లిదండ్రులను పలువురు అభినందించారు.