ప్రొద్దుటూరులో బాధితుల ధర్నా

ప్రొద్దుటూరులో బాధితుల ధర్నా

KDP: ప్రొద్దుటూరు పట్టణంలో డ్రైనేజీ ఆక్రమణల తొలగింపులో మున్సిపల్ అధికారులు పారదర్శకత పాటించడం లేదని నిరసిస్తూ స్థానిక శ్రీరాములపేట ప్రజలు ఇవాళ ధర్నా చేశారు. డ్రైనేజీ ఆక్రమణల తొలగింపును రెండు వైపులా కాకుండా ఒకవైపు మాత్రమే చేపట్టారని బాధిత ప్రజలు ఆరోపించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణం పేరుతో ఒకవైపు మాత్రమే కట్టడాలను అధికారులు తొలగించడం పక్షపాత వైఖరి అని వాపోయారు.