కొత్తవలస ఆర్పీఫ్ ఉద్యోగికి బంగారు పతకం
విజయనగరం: కొత్తవలస రైల్వే రక్షక దళం ఔట్ పోస్ట్‌లో పనిచేస్తున్న బి. పద్మలోచన రాష్ట్రపతి బంగారు పతకంను అందుకున్నారు. ఈ మేరకు గుజరాత్ రాష్ట్రం వాల్సాడ్‌లో జరిగిన కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. తన విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించడంపై పతకం సాధించినట్లు తెలిపారు. తోటి ఉద్యోగులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు.