ఒంగోలులో చేనేత కార్మికుల ర్యాలీ

ప్రకాశం: ఒంగోలులో జాతీయ చేనేత దినోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ బంగ్లా వరకు ఈ ర్యాలీ సాగింది. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగాన్ని ఆదుకోవాలని కార్మికులు కోరారు. ఈ ర్యాలీలో పలువురు అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.