సివిల్ సప్లై అధికారుల దాడులు.. 31 సిలిండర్ల స్వాధీనం
KMR: గాంధారి, రాజంపేట, బాన్సువాడ మండల కేంద్రాల్లో ఆదివారం సివిల్ సప్లై అధికారులు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలపై దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు ఉపయోగించే 31 ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై అధికారి కిష్టయ్య తెలిపారు.గృహ వినియోగ సిలిండర్లను వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.