మామిడి వలసలో పాస్‌పుస్తకాల పంపిణీ
ASR: భూ సమస్యలు, తగాదాలు తలెత్తకుండా ఉండేందుకు రాజముద్రతో ముద్రించిన పాస్‌పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు తెలిపారు. డుంబ్రిగూడ మండలంలోని కొర్ర పంచాయతీ మామిడి వలస గ్రామంలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో పాస్‌పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 30 పాస్‌పుస్తకాలకు గాను 26 పుస్తకాలను అందజేశారు.