కుల్సుంపురా ఏసీపీపై వేటు

కుల్సుంపురా ఏసీపీపై వేటు

హైదరాబాద్‌లో మరో పోలీసు అధికారిపై వేటు పడింది. కుల్సుంపురా ఏసీపీ మునావర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మునావర్‌పై అవినీతి ఆరోపణలు రావడం, భూ వివాదాల కేసుల తారుమారు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.