'జల హారతి'లో చెరువు శుభ్రం
GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 'జల ధార- జల హారతి' కార్యక్రమంలో భాగంగా స్థానిక రజక చెరువును శుభ్రపరిచారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది చెరువులోని చెత్తను తొలగించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ చర్యతో పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపడనున్నట్లు తెలుస్తోంది.