నేడు తణుకులో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు తణుకులో విద్యుత్ సరఫరా నిలిపివేత

W.G: తణుకు మండలం తేతలి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో పలు విద్యుత్‌ లైన్లు మరమ్మతుల నిమిత్తం ఆదివారం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ కే.నరసింహమూర్తి తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తేతలి ఇందిరా నగర్, తేతలి ఇండస్ట్రియల్‌ ఎస్టేట్, వడ్లూరు, చివటం ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.