హైటెక్స్‌లో ఉత్సహంగా సాంస్కృతిక వేడుకలు
HYD: హైటెక్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ-ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వేడుకలు ఉత్సహంగా కొనసాగుతున్నాయి. నిన్న రాష్ట్రంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలండ్, త్రిపుర సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజలు జీవనశైలిని ప్రతిబింబించేలా కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 20 మంది ఫొటోగ్రాఫర్లు తీసిన 60 ఫొటోలతో ఏర్పాటైన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.