VIDEO: ఇందిరాపార్క్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కర్ణన్
హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పార్క్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్క్‌లో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. పార్క్‌లో ఉన్న చిల్డ్రన్ ప్లే ఏరియాను వీలైనంత తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.