వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు

AP: యూరియాలో అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రూ.250 కోట్ల అవినీతి జరిగిందని అసత్యాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రైతు సేవా కేంద్రాల్లో యూరియా బస్తాపై అదనంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. యూరియా ఇవ్వలేకపోయామని సాక్షిలో అసత్యాలు ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా పంపిణీలో ఎక్కడా సమస్య లేదన్నారు.