బిక్కనూరులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

బిక్కనూరులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

కామారెడ్డి జిల్లాలో ఎండలు ఠారెత్తిసున్నాయి. జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. బిక్కనూర్‌లో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, నస్రుల్లాబాద్ మండలంలోని బోమన్ దేవనపల్లి, జుక్కల్, మద్నూర్ మండలంలోని సోనూరులలో 42.8, పాల్వంచ మండలంలోని వేల్పుగొండలో 42.6, అత్యల్పంగా రామారెడ్డిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.