విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి

విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి

NRML: విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన లక్ష్మణచందా మండలంలో బుధవారం చోటుచేసుకుంది. నర్సాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి(48) తన పంట చేనుకు అటవీ పందుల నుంచి రక్షణ కోసం విద్యుత్ కంచెను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పొలానికి వచ్చిన రవీందర్ రెడ్డి ప్రమాదవశాత్తూ విద్యుత్తు కంచెకు తగలడంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు.