శ్రీనివాసరావును అభినందించిన డీఆర్ఎం
విశాఖపట్నం వాల్తేరు డివిజన్ డిప్యూటీ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ (కన్‌స్ట్రక్షన్) ఎస్.శ్రీనివాసరావును ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా ‘అతి విశిష్ట రైల్ సేవా పురస్కారం’ అందుకున్న సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.