రూ.50 లక్షలు విలువైన మద్యం బాటిళ్ల ధ్వంసం

GNTR: జిల్లా వ్యాప్తంగా పలు కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను సోమవారం ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో అధికారులు సంయుక్తంగా రూ.50 లక్షలు విలువ కలిగిన 24 వేల బాటిళ్లను జేసీబీతో తొక్కించారు. 4,626 లీటర్లు మద్యాన్ని ప్రజల ఆరోగ్య దృష్ట్యా నాశనం చేసినట్లు ఎస్పీ తెలిపారు.