VIDEO: ఇంట్లోకి దూరి త్రాచుపాము హల్‌చల్
VSP: విశాఖపట్నం సుందరయ్య కాలనీలో ఓ ఇంట్లోకి త్రాచుపాము ప్రవేశించి హల్‌చల్ చేసింది. దీంతో సదరు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ ఘటనాస్థలికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.