VIDEO: 'వరి పంటకు నష్టపరిహారం ఇవ్వాలి'
SRD: ఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో చెరువు కింద వరి పంట వరద దాటికి నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు వాపోయారు. చెరువు వరద నీరు ఇప్పటికీ తమ పొలాల్లో నుంచి ప్రవహిస్తోందని రైతులు లింగమేష్, లతీఫ్, వడ్ల నర్సింలు, దొడ్ల సాయిలు, లింగన్న ఇవాళ తెలిపారు. మొత్తం 30 ఎకరాలు వరద నీటిలో మునగగా, 10 ఎకరాలు పూర్తిగా నష్టమైందని చెప్పారు. వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.