VIDEO: బ్లేడ్ బ్యాచ్‌ని నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు
నెల్లూరు: జిల్లా పోలీస్ శాఖ నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిలో భయం మొదలైంది. సోమవారం రాత్రి, నగరంలో ప్రైవేటు టౌన్ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేసిన ఐదుగురు నిందితులను గాంధీ బొమ్మ సెంటర్ నుంచి నెల్లూరు మద్రాసు బస్టాండ్ వరకు బహిరంగంగా నడిపించారు.