'జర్నలిస్టుల మహా ధర్నాను విజయవంతం చేయాలి'
NLG: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ప్రధాన సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 3న, మసాబ్ ట్యాంక్, సమాచార కమిషనర్ కార్యాలయం ముందు జరిగే మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు ఏళ్ల బయన్న విజ్ఞప్తి చేశారు. ధర్నా శాంతియుతంగా ఉ. 10:30 నుంచి మ.1:30 వరకు కొనసాగుతుందని, నిర్ణీత సమయానికి విచ్చేయాలని విజ్ఞప్తి చేశారు.