VIDEO: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు భారీ నష్టం
WGL: పర్వతగిరి మండలం కొంకపాక గ్రామంలో నీటమునిగిన పంటలను శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు భారీగా నష్టపోయారని, సమయానుసారంగా నీరు, యూరియా సరఫరా చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే నష్టం తప్పేదని అన్నారు. వెంటనే రైతులకు నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలన్నారు.