భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష..!

భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష..!

GDWL: అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమె మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 25000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి ప్రేమలత సోమవారం తీర్పునిచ్చారు. ​అలంపూర్ మండలం, సింగవరానికి చెందిన చాకలి హరికృష్ణకు, కర్నూలు జిల్లాకు చెందిన జూపల్లి మల్లికకు 2022లో వివాహమైంది. అదనపు కట్నం వేధింపులు భరించలేక మల్లిక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయ చేసుకున్న విషయం తెలిసిందే.