‘క్షయ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి’
BDK: క్షయ గాలి ద్వారా వ్యాపిస్తుందని, దీర్ఘకాలిక దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ రేవంత్ సూచించారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ క్షయ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.