సీసీ రోడ్డు పనులకు భూమిపూజ
NZB: డిచ్పల్లి మండలం బర్దిపూర్ హరి హర దేవాలయ ప్రాంగణంలో సీసీ పనులకు సర్పంచ్ భాస్కర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్.. నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సీసీ పనులు పూర్తయితే భక్తులకు సౌకర్యం వంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.