మెగా డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితా విడుదల
GNTR: మెగా డీఎస్సీకి సంబంధించి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో 1,143 మంది అభ్యర్థులును విద్యాశాఖ ఎంపిక చేసింది. రిజర్వేషన్ల కారణంగా ఖాళీగా మిగిలిన 19 పోస్టులను తర్వాత భర్తీ చేస్తారు. ఈనెల 19న అమరావతిలో జరిగే కార్యక్రమంలో ఎంపికైన వారికి నియామకపత్రాలు అందిస్తామని మంగళవారం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.