దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

VKB: బషీరాబాద్ మండలంలోని కోర్విచేడ్ గ్రామంలో పెరుగుతున్న దోమల సమస్యను అరికట్టేందుకు గ్రామ పంచాయతీ ముమ్మర చర్యలు చేపట్టింది. సర్పంచ్ నవీన్ రెడ్డి, ఉప సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వీధులు, కాలనీల్లో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, స్వచ్ఛత పాటించాలని వారు సూచించారు.