పేకాడుతున్న ఏడుగురు వ్యక్తుల అరెస్టు
MNCL: జన్నారంలో పేకాడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి తెలిపారు. సోమవారం రాత్రి జన్నారంలోని ఒక ఫంక్షన్ హాల్లో కొందరు పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఈ సందర్భంగా ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామని, మరో ఇద్దరూ పరారీలో ఉన్నారన్నారు. పేకాడుతున్న వ్యక్తుల నుండి రూ.30,270 నగదు స్వాధీనం చేసుకున్నారు.