VIDEO: పర్యావరణంపై విద్యార్థుల అవగాహన
విశాఖ జీవీఎంసీ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం పెరుగుతోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను వేర్వేరు బుట్టల్లో వేయడం వంటి అలవాట్లు పాటించాలని వారు సూచిస్తున్నారు. పరిశుభ్రమైన విశాఖ కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు.