గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు 57 విమాన సర్వీసులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విమాన సర్వీసులు కొనసాగుతున్నాయని పౌర విమానయానశాఖ తెలిపింది. అబుదాబీ, దుబాయ్, ఫజైరా, జెడ్డా, మస్కట్, రస్ అల్ ఖైమా, రియాద్, షార్జా నుంచి 57 విమానాలను షెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది. గత నెల 28 నుంచి ఈ నెల 11 వరకు ఆయా దేశాల నుంచి 1,50,457 మంది భారతీయులు స్వదేశానికి వచ్చినట్లు చెప్పింది.