రక్త పరీక్ష కేంద్రాన్ని తరలించరాదని ధర్నా

రక్త పరీక్ష కేంద్రాన్ని తరలించరాదని ధర్నా

ATP: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మంగళవారం ఐద్వా, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐద్వా మహిళా సంఘం నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని రక్త పరీక్ష కేంద్రాన్ని పై అంతస్తుకు తరలించడంతో రోగులు ఇబ్బందులు పడతారన్నారు. పరీక్ష కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.