నిర్మల్ బరిలో 182 మంది అభ్యర్థులు

నిర్మల్ బరిలో 182 మంది అభ్యర్థులు

నిర్మల్ మున్సిపల్ ఎన్నికల అభ్యర్ధులు ఖరారయ్యారు. 42వార్డులకు గాను మొత్తం 182 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 22వ వార్డులో అత్యధికంగా 9 మంది పోటీ పడుతుండగా, 24వ వార్డులో కేవలం ఇద్దరు మాత్రమే బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అభ్యర్థుల సంఖ్య తేలడంతో ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.