VIDEO: బ్రహ్మోత్సవాలలో అన్న ప్రసాద వితరణ
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, వారికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తాత నరసింహారావు–హైమావతి దంపతులు ఏర్పాటు చేశారు. అన్నప్రసాద వితరణను దేవస్థానం చైర్మన్ రవీందర్ గుప్తా, ఈవో రంగాచారి ప్రారంభించారు.