పార్లమెంట్‌లో 'నంబర్‌ 1' చెట్టు.. భద్రతకు అడ్డు..!

పార్లమెంట్‌లో 'నంబర్‌ 1' చెట్టు.. భద్రతకు అడ్డు..!

పార్లమెంట్‌లో ఓ చెట్టు వీవీఐపీల భద్రతకు సవాల్‌గా మారింది. కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లటానికి ఆరు మార్గాలు ఉంటాయి. అయితే ప్రధాని మోదీ వెళ్లే గజ ద్వారం వద్ద 'నంబర్-1'గా పేర్కొన్నే ఓ పసుపు పూల చెట్టు ఉంది. అది విపరీతంగా పెరిగి ఆ ప్రాంతంలో భద్రతకు అడ్డంకిగా మారింది. భద్రతా కారణాల దృష్ట్యా SPG సూచనల మేరకు ఆ చెట్టును అక్కడి నుంచి మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.