మెరుగైన వైద్య సేవలు అందించండి

మెరుగైన వైద్య సేవలు అందించండి

ప్రకాశం: ఒంగోలు నగరంలోని కోర్ట్ సెంటర్ వద్ద ఉన్న మాతా శిశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, అవసరమైన మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే వైద్యసేవలను మరింత మెరుగుపరచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.