వేతనాల ఆలస్యం.. రేపు ఆందోళనకు పిలుపు
గుంటూరు: తెనాలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయని సీపీఎం నేత బాబు ప్రసాద్ విమర్శించారు. సమయానికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.