'వైసీపీ పార్టీని పటిష్టంగా చేస్తా'
W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇవాళ మధ్యాహ్నం వైసీపీ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డే రఘురామ్ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అందరి నాయకులను కలుపుకుని పటిష్ట పరిచేదిశగా పని చేస్తానని తెలిపారు.