వైభవంగా గ్రామ దేవత ఉత్సవం

SKLM: టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం బంజేరి పేట గ్రామంలో గ్రామ దేవత పాలపోలమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమాన్ని శనివారం నాడు గ్రామస్తులు, భక్తులు వైభవంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా వేకువ నుండి అమ్మవారికి పంచామృత మహా అభిషేకాదులు నిర్వహించి పూజలు చేసారు. అనంతరం మహా చండీయాగం చేసి పూర్ణహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.