ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన కొడుకు
BPT: కన్న కొడుకే కర్కశంగా తండ్రిని కడతేర్చిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. చుండూరు మండంలం మోదుకూరుకు చెందిన నరసింహారావును అతని కుమారుడు రవీంద్ర హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గూడవల్లిలోని బావిలో పడేశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.