'గడువులోగా ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలి'
GNTR: తెనాలిలో వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్‌లను సకాలంలో రెన్యూవల్ చేయించుకోవాలని, లేని పక్షంలో పెనాల్టీ విధిస్తామని శుక్రవారం ఎంహెచ్ఓ యేసుబాబు హెచ్చరించారు. మైక్ అనౌన్స్‌మెంట్లతో పాటు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల ద్వారా వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు లక్ష్యానికి గాను రూ. 55 లక్షల ఫీజు మాత్రమే వసూలైందని తెలిపారు.