అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
NTR: విజయవాడలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్తులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 32 లక్షల విలువైన 216 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కొండపల్లికి చెందిన గోపీనాథ్, రాంబాబు జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏడీసీపీ రాజారావు తెలిపారు.