పతనం అవుతున్న కొబ్బరికాయ ధర
కోనసీమ: జిల్లాలో కొబ్బరికాయ ధర రోజు రోజుకి పతనం అవుతుంది. గతవారం రోజుల క్రితం రూ.20 నుంచి రూ.22 వరకు పలికిన ధర నేడు రూ.18కి పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా భారీ ధర వస్తుంది అని ఆశించిన రైతులు కొబ్బరికాయలు భారీగా నిల్వ ఉంచారు. ధర పతనం కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు.