పేరెంట్స్ మీట్‌కు రూ.54.92 లక్షలు నిధులు విడుదల

పేరెంట్స్ మీట్‌కు రూ.54.92 లక్షలు నిధులు విడుదల

ASR: జిల్లాలో డిసెంబర్ 5న జరగనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కోసం ప్రభుత్వం రూ.54.92 లక్షలు విడుదల చేసినట్లు DEO బ్రహ్మాజీరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,913 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రతి పేరెంట్‌కు ఆహ్వానం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.