నాన్న PUBG అడోద్దాన్నందుకు కోడుకు ఆత్మహత్య

నాన్న PUBG అడోద్దాన్నందుకు కోడుకు ఆత్మహత్య

NRML: PUBGకి బానిసైన ఓవిద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం భైంసాలో చోటు చేసుకుంది. HYDకి చెందిన భేతి సంతోష్ కుటుంబం భైంసాలో చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయన కుమారుడు రిషేంద్ర(13) 9వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో PUBGకి బానిసయ్యాడు. PUBG ఆడొద్దని తండ్రి మందలించగా మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.