ప్రిన్సిపాల్ కొట్టాడని విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
KNR: ప్రిన్సిపల్ కొట్టాడని విద్యార్థులు గడ్డి మందు తాగిన ఘటన జమ్మికుంట పట్టణంలో చోటుచేసుకుంది. మాస్టర్ SV స్కూల్ హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న వీణవంకకు చెందిన చరణ్, రామ్ అనే ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపల్ కొట్టాడని ఆరోపిస్తూ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే ఉపాధ్యాయులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.